About Us

మా ప్రయాణం

30 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో, స్వతంత్రంగా మరియు ప్రజల సమస్యలను
ప్రతిబింబించే స్థానిక దినపత్రికగా కోకనాడ న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది.

డాక్టర్ సబ్బెళ్ల శివన్నారాయణ రెడ్డి

ప్రముఖ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో దాదాపు మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. జీ- తెలుగు,6-tv, దూరదర్శన్ వంటి ప్రముఖ ఛానల్స్ లో పనిచేశారు. సర్కార్ ఎక్స్ప్రెస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా నడుపుతున్నారు.
యోగాలో ఆయన డాక్టరేట్ కూడా తీసుకున్నారు. దర్శనీయ స్థలాలు, పర్యాటక రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పర్యాటకంపై ఆయన ప్రచురించిన పుస్తకాలకు రాష్ట్రస్థాయిలో వరుసగా 5 అవార్డులు కూడా వచ్చాయి

జె.ఎస్.వి.ఎస్.ఎన్. మూర్తి

1995 లో ఆంధ్రభూమి దినపత్రిక తో ప్రారంభమై… ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి పత్రికలలో కాకినాడ కేంద్రం గా దాదాపు 30 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాను.
దాదాపు 30 సంవత్సరాల పాటు వేరు వేరు సంస్థలలో పనిచేసిన అనుభవంతో ఒక స్థానిక దినపత్రికను నడపాలన్న ఆలోచన వచ్చింది. ముఖ్యంగా పాఠకుల ఆకాంక్షలకు అనుగుణంగా …. భిన్నమైన శీర్షికలతో అన్ని వర్గాల పాఠకుల ఆదరణ పొందేలా పత్రికను సమర్థవంతంగా నడపాలన్నదే లక్ష్యంగా కోకనాడ న్యూస్ ఎక్స్ప్రెస్ పేరిట పత్రిక స్థాపనకు బీజం పడింది. ఏ ఒక్క రాజకీయ పార్టీ కో… సంస్థకో… కొమ్ము కాయకుండా అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ పత్రికను నడపాలన్నదే వీరిద్దరి అభిలాష.
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా, వైద్య రంగాలలో వస్తున్న మార్పులను, తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు…. ప్రజలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారం దిశగా కోకనాడ న్యూస్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ఒక వేదికగా నిలవాలన్నదే లక్ష్యం.
ముఖ్యంగా స్థానికంగా జరిగే కార్యక్రమాలు, అంశాలకు అత్యధిక ప్రాధాన్యత నివ్వడమే ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం.
నిర్వహణా భారంతో అనేక స్థానిక దినపత్రికలు మనుగడ సాధించలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో …. పత్రికతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా… డిజిటల్ మీడియా దిశగా కూడా కొకనాడ న్యూస్ అడుగులు వేస్తోంది.

Registration Certifications

Scroll to Top